పోక్సో కోర్టు ఇన్‌చార్జి పీపీగా చిలకమారి వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-02-16T06:02:31+05:30 IST

పోక్సో కోర్టు ఇన్‌చార్జి పీపీగా చిలకమారి వెంకటేశ్వర్లు

పోక్సో కోర్టు ఇన్‌చార్జి పీపీగా చిలకమారి వెంకటేశ్వర్లు
వెంకటేశ్వర్లుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న సత్యనారాయణ

మహబూబాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 15 : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పోక్సో కోర్టు ఇన్‌చార్జ్‌ పీపీగా అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చిలకమారి వెంకటేశ్వర్లును నియమిస్తూ వరంగల్‌ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గ్రేడ్‌-1 డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎం.సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నెపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 1984-1987లో వరంగల్‌లోని ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాలలో న్యాయవిద్యను పూర్తి చేశారు. 1992 నుంచి  న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన మహబూబాబాద్‌ కోర్టులో 2004 నుంచి 2011 వరకు సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా, 2004 సంవత్సరంలో మానుకోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. గత నెల రోజుల క్రితం అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. ఇందులో మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు. తాజాగా పోక్సో కోర్టు ఇన్‌చార్జ్‌ పీపీగా నియామకమయ్యారు.

Read more