‘దళితబంధు’ అమలుకు పక్కా ప్రణాళిక

ABN , First Publish Date - 2022-01-23T05:43:07+05:30 IST

‘దళితబంధు’ అమలుకు పక్కా ప్రణాళిక

‘దళితబంధు’ అమలుకు పక్కా  ప్రణాళిక
కలెక్టరేట్‌ సమీపంలో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న కలెక్టర్‌ శశాంక

కలెక్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకం అమలుకు పటిష్ఠమైన కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్‌ శశాంక నివేదించారు. కరీంనగర్‌ నుంచి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పు ల ఈశ్వర్‌, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామకృష్ణతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దళిత బంధు పథకం అమలుకు చేపట్టాల్సిన అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నివేదిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు దళితబంధు అమలయ్యేలా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఫిబ్రవరి 5లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి మార్చి 7లోపు యూనిట్ల గ్రౌండ్‌ల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద అర్హులైన వారిని 100 మందిని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసి నివేదిక రూపొందించాలన్నారు. దళితలు అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా తీసుకున్న దళితబంధు పథకం దేశంలోనే గొప్ప పథకమన్నారు. తొలుత రాష్ట్రంలోని హూజూరాబాద్‌ నియోజవర్గంలోని వాసాలమర్రి గ్రామం, మరో నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులను ఫిబ్రవరిలోపు ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి మార్చి 7లోగా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ శశాంక అధికారులకు దళిత బంఽధుపై సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఉన్నతాధికారులతో  పాటు ఇద్దరు జిల్లా అధికారులను ఇన్‌చార్జీలుగా వేయాలని కలెక్టర్‌ సూచించారు. నియోజకవర్గంలోని మండలాల్లో ఎస్సీ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సత్వరమే అందించాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జడ్పీసీఈవో రమాదేవి పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో మూడో శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రమదానం చేపట్టారు. కలెక్టరేట్‌ సమీపాన చెత్తాచెదరాన్ని తొలగించారు. కార్యాలయాల్లో బీరువాలను, టేబుల్‌, కుర్చీలను ఫైళ్లను శుభ్రపరిచారు. అధికారులంతా తమ కార్యాలయాలను ఇదేవిధంగా శుభ్రపరుచుకోవలని సూచించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, పరిపాలన అధికారి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more