అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు

ABN , First Publish Date - 2022-09-13T09:56:56+05:30 IST

అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐఎ్‌ఫఎ్‌సలు, 8 మంది డీఎ్‌ఫవోలను బదిలీచేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు

17 మంది ఐఎ్‌ఫఎస్‌, 8 మంది డీఎ్‌ఫఓలకు స్థానచలనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐఎ్‌ఫఎ్‌సలు, 8 మంది డీఎ్‌ఫవోలను బదిలీచేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ఇటీవలే 8 మంది అధికారులు ఐఎ్‌ఫఎ్‌సగా పదోన్నతులు పొందారు. వీరు డెహ్రాడూన్‌ శిక్షణ పొందుతున్నారు. వీరికి ఐఎ్‌ఫఎస్‌ హోదాలో పోస్టులను కేటాయించారు. మరో నలుగురు ఐఎ్‌ఫఎస్‌ అధికారులు డివిజన్‌ ఫారెస్ట్‌ అధికారి స్థాయి నుంచి జిల్లా అటవీ అధికారులుగా నియమించారు. మిగిలిన 13 మం దిలో సీనియర్‌ ఐఎ్‌ఫఎ్‌సలతోపాటు అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ అధికారులు ఉన్నారు. 

Read more