టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-10-08T11:06:20+05:30 IST

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) ప్రకటించింది.

టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి:  యూటీఎఫ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావులు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాడుతున్న మాణిక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం, సమస్యలపై అవగాహన ఉన్న మాణిక్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని టీచర్లకు వారు పిలుపునిచ్చారు. 

Read more