‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట మాల్‌వేర్‌లు..

ABN , First Publish Date - 2022-03-16T15:27:27+05:30 IST

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట మాల్‌వేర్‌లను హ్యాకర్లు పంపిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో అనుమానాస్పద మాల్‌వేర్‌లను హ్యాకర్లు పంపిస్తున్నారు.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట మాల్‌వేర్‌లు..

హైదరాబాద్ : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట మాల్‌వేర్‌లను హ్యాకర్లు పంపిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో అనుమానాస్పద మాల్‌వేర్‌లను హ్యాకర్లు పంపిస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ఉచిత యాక్సెస్‌ నెపంతో సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్‌లు దర్శనమిస్తున్నాయి. వాట్సాప్‌లో పంపిన మాల్‌వేర్‌లను క్లిక్ చేయడం ద్వారా ఫోన్‌లను హ్యాక్ చేయడం, మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను హ్యాకర్లు ఖాళీ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Read more