వంట ఏజెన్సీలకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2022-08-26T05:04:09+05:30 IST

సర్కారు బడిలో మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీలకు తిప్పలు తప్పడం లేదు.

వంట ఏజెన్సీలకు తప్పని తిప్పలు
గోపాల్‌పేటలో ఆరుబయట వంట చేస్తున్న నిర్వాహకులు

 గదులు లేక ఆరుబయటే వంటలు 

 పురుగులు పట్టిన బియ్యం సరఫరాతో ఇబ్బందులు 

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెల్లించాల్సింది రూ. 7.64 కోట్లు 

 పెండింగ్‌లోనే ఐదు నెలల బిల్లులు 

 ఇబ్బంది పడుతున్న నిర్వాహకులు

 పెరిగిన ధరలకనుగుణంగా బిల్లులు పెంచాలని డిమాండ్‌


సర్కారు బడిలో మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీలకు తిప్పలు తప్పడం లేదు.  చాలాచోట్ల వంట గదులు లేక ఆరుబయటే వంట చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో  వంట చేయాలంటే నరకం అనుభవిస్తున్నారు.   అంతే కాకుండా ప్రభుత్వం పురుగుల బియ్యాన్ని సరఫరా చేయడంతో వారి కష్టాలు వర్ణణాతీతం. పెరిగిన నిత్యావసర   సరకుల ధరలు, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వంటి సమస్యలతో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వంట ఏజెన్సీలకు ప్రభుత్వం దాదాపు రూ. 7.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

అమరచింత/గోపాల్‌పేట, ఆగస్టు 25: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం లో  వంట చేస్తున్న ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.   ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 3166 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 2,77,659 మంది విద్యార్థులు చదువుతున్నారు. వంట ఏజెన్సీ కార్మికు లు 7304 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చాలాచోట్ల వంట గదులు లేక ఆరుబయటే వంట చేస్తున్నారు.  వర్షాకాలంలో  వంట చేయాలంటే నరకం కనిపిస్తోందని వంట ఏజెన్సీవారు వాపోతు న్నారు. అంతే కాకుండా పెరిగిన నిత్యావసర సరకుల ధరలకు అనుగునంగా బిల్లులు చెల్లించకుండా పాత ధరలకే బిల్లులు చేయడంతో అప్పులపాలవుతున్నా మని వారు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర  రూ.5.30లు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ.4 మాత్రమే చెల్లిస్తోంది. పెరిగిన ధరకు గుడ్లు కొనుగోలు చేసి విద్యార్థులకు  అందిస్తున్నామ ని, ప్రభుత్వం మాత్రం మాకు నాలుగు రూపాయలే చెల్లిస్తే మిగతా డబ్బులు మా చేతినుంచి వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కూరగాయలకు కూడా మార్కెట్లో ధరలు పెరిగిపోవడంతో కొనుగోలు చేయలేక వంట ఏజెన్సీలనే బంద్‌ చేసుకునే పరిస్థితి దాపురించిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం పురుగులు చిట్టెలు కట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వంట కార్మికులకు అందిస్తున్న  వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంచడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.  ఒక్క గోపాల్‌పేట, రేవల్లి మండలా ల్లోనే 53 పాఠశాలలు ఉన్నాయి. వంట మహిళలకు మండల వ్యాప్తంగా ఒక్క నెలకు సమారుగా 8 నుంచి 9 లక్షలు బిల్లు అవుతుంది. ఐదు నెలలకు కలిపి సమారుగా రూ.45 లక్షలు అవుతుంది. ఇప్పటి వరకు వారికి ఒక్క బిల్లు కూడా రాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.7.64 కోట్లు కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేయలేదని తెలుస్తోంది. పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 




Updated Date - 2022-08-26T05:04:09+05:30 IST