పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2022-12-13T23:00:59+05:30 IST

జిల్లాలో మొదటి విడతలో మన ఊరు- మన బడి కింద ఎంపిక చేసిన 290 బడుల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అధికారులను ఆదేశించారు.

పనుల్లో వేగం పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మనూచౌదరి

- అదనపు కలెక్టర్‌ మనూచౌదరి

- మన ఊరు మన-బడిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు13: జిల్లాలో మొదటి విడతలో మన ఊరు- మన బడి కింద ఎంపిక చేసిన 290 బడుల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అధికారులను ఆదేశించారు. మం గళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, విద్యాశాఖ అధికా రులతో అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 212 పాఠశాలలకు ఇప్పటి వరకు రూ. 7.94 కోట్ల పనులు పూర్తయ్యాయని, పనుల్లో వేగం పెంచి నిధులను ఎస్టీవోలను వెంటనే జనరేట్‌ చేయాలని ఏఈలను ఆదేశించారు. ఇంకా 56 పాఠశాలల్లో రూ.30లక్షలకు పైగా ఖర్చు చేయా ల్సిన నిధులను టెండర్లు పూర్తి చేయాలని ఆదే శించారు. ఇప్పటికి కేవలం ఎనిమిది పాఠశాల్లో టెండర్లు పూర్తి చేశారని, మిగతా వాటిలో వెం టనే పనులు ప్రారంభించేలా అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. మన ఊరు- మన బడి పనుల పురోగతిపై నిర్లక్ష్యం వహించిన కోడేరు, లింగాల, తెల్కపల్లి, అచ్చంపేట అమ్రాబాదు ఏఈలకు షోకాజు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, పీఆర్‌ ఈఈ దామోదర్‌రావు, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌ శ్రీధర్‌, దుర్గాప్రసాద్‌, ప్ర తాప్‌ సెక్టరియల్‌ అధికారి వెంకటయ్య, ఏపీఓ రఘు, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:01:01+05:30 IST