త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-30T23:21:55+05:30 IST

పాఠశాలల్లో చేపట్టిన పను ల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు.

 త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
నర్వ పాఠశాలలో పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష

- ‘మన ఊరు - మన బడి’ పనుల పరిశీలన

నర్వ డిసెంబరు 30: పాఠశాలల్లో చేపట్టిన పను ల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రాయి కోడ్‌, రాజుపల్లె, పాతర్‌ చేడ్‌, ఉందేకోడ్‌, నర్వ గ్రామా ల్లో ‘మన ఊరు- మన బడి’ పనులను పరిశీలించారు. నర్వలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగు తున్న పాత భవనం మరమ్మతు పనులు, కొత్తగా నిర్మిస్తున్న డైనింగ్‌ హాల్‌ షెడ్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ‘మన ఊరు - మన బడి’ కిం ద చేపట్టిన మరుగుదొడ్లు, ప్రహరీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనం తరం తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీ లించారు. పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చే యాలని తహసీల్దార్‌ దయాకర్‌ రెడ్డిని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించొద్దని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ దయాకర్‌ రెడ్డి, ఎంపీడీవో రమేష్‌, గ్రామ సర్పంచ్‌ పెద్దింటి సంధ్య, పంచాయతీ కార్య దర్శి శ్రావణి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

చిత్తనూర్‌ గ్రామంలో..

మరికల్‌ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరీక్షలు శుక్రవారం కొనసాగాయి. జిల్లా కలెక్టర్‌ శ్రీహర్ష జిల్లాలోని చిత్తనూర్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. అదేవిధంగా డీఈవో గోవిందరాజులు, మరికల్‌ తహసీల్దార్‌, జిల్లా సెక్టోరియల్‌ అధికారి తదితరులు మరికల్‌, ఎలిగండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల నోడల్‌ ఆఫీసర్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:21:55+05:30 IST

Read more