రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-06-12T04:41:45+05:30 IST

దైవ దాసంగానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ గోకారి కథనం ప్రకారం..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఎర్రవల్లి చౌరస్తా, జూన్‌ 11: దైవ దాసంగానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ గోకారి కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా చిన్న టేకూర్‌ గ్రామానికి చెందిన భారతి (45) కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శుక్రవారం రాత్రి ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయానికి దాసంగం పెట్టేందుకు వచ్చిం ది. రాత్రి అక్కడే నిద్ర చేశారు. శనివారం ఉదయం దాసంగం పెట్టి, మొక్కు తీర్చుకుని తిరిగి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎర్రవల్లి చౌరస్తా సమీ పంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆటో రోడ్డు పక్కనున్న లోయలో పడింది. తీవ్ర గాయాల పాలైన భారతిని చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి భర్త వెంకట్రాముడుతో పాటు మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Read more