కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

ABN , First Publish Date - 2022-11-25T00:03:05+05:30 IST

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు.

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు
విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనను పరిశీలిస్తున్న డీఈవో

- డీఈవో గోవిందరాజులు

నారాయణపేట, నవంబరు 24 : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. చదువుతో పాటు సంప్రదాయ కళలు నేర్చుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలపాలని ఆయన విద్యార్థులను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలు ముగింపు కార్య క్రమంలో ఆయన పాల్గొని విజేతల పేర్లను ప్రకటించారు. శాస్త్రీయ నృత్యంలో మక్తల్‌కు చెందిన జ్ఞాపిక, జానపద నృత్యంలో ధన్వాడకు చెందిన సునీల, మక్తల్‌కు చెందిన నర్సింహా, శాస్త్రీయ గాత్రంలో పేట గురుకులంకు చెందిన అశ్వి ని, జానపద గాత్రంలో పేట గురుకులంకు చెందిన హర్షిత, మక్తల్‌కు చెందిన నిఖిల్‌, డ్రామాలో నర్వకు చెందిన సాయి హర్షిత, మంథన్‌గోడ్‌కు చెందిన ప్రదీప్‌, సంగీత వాయిద్యంలో పేట గురుకులంకు చెందిన సంయుక్త, కోస్గి ముష్రిఫాకు చెందిన మహేందర్‌, విజువల్‌ ఆర్ట్స్‌ 2 డీలో పేట కృష్ణవేణికి చెందిన స్నేహ, బిజ్వార్‌కు చెందిన అనిల్‌, 3డీలో బిజ్వార్‌కు చెందిన భవిత, బొమ్మల తయారీలో పేట గురుకులంకు చెందిన శాంతికుమారి, కోస్గి ముష్రీఫాకు చెందిన రామకృష్ణ గెలుపొందారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సామమాగ్రిని డీఈవో పరిశీలించి అభినందించారు. విద్యాశాఖ సిబ్బంది విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, బాల మురళి, పర్వీన్‌ బేగం, శ్రీకాంత్‌, అపర్ణ, లక్ష్మణ్‌, నర్సింహులు, వసంత్‌, జ్ఞానామృత పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన

ఊట్కూర్‌ : కళా ఉత్సవ్‌ పోటీల్లో మండలంలోని బిజ్వార్‌కు చెందిన అనిల్‌ చిత్రలేఖనం, డి.భవిత క్రాఫ్ట్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించ డంతో ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్లు హర్షద్‌, మనోహర్‌, హెచ్‌ఎం ధనుంజయ్‌ విద్యార్థులను అభినందించారు.

Updated Date - 2022-11-25T00:03:05+05:30 IST

Read more