తొలిమెట్టు ఎక్కేదెలా?

ABN , First Publish Date - 2022-09-24T05:26:05+05:30 IST

కరోనా కారణంగా విద్యాభివృద్ధి కుంటుపడింది. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు పరుస్తోంది.

తొలిమెట్టు ఎక్కేదెలా?
ఉత్తనూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయుడి బోధన తీరును పరిశీలిస్తు యుప్‌లో నమోదు చేస్తున్న నోడల్‌ అధికారి

అటకెక్కిన చదువులు గాడిన పడేనా 

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత 

ప్రధానోపాధ్యాయులపై పనిభారం

అయిజ, సెప్టెంబరు 23: కరోనా కారణంగా విద్యాభివృద్ధి కుంటుపడింది.  అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు పరుస్తోంది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమం పేరుతో శిక్షణ ఇచ్చారు.కరోనా కారణంగా రెండు సంవత్సరాలు  విద్యార్థులలో నైపుణ్యాలు తగ్గాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు బేసిక్స్‌ కూడా మరిచిపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులలో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు జూలైలో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగస్టు వరకు  శిక్షణ ఇచ్చింది.  ఇందులో  పిల్లలకు బేసిక్స్‌పై పరీక్షలు నిర్వహించడం,  అభ్యసన స్థాయిలను గుర్తించడం, విద్యార్థుల స్థాయికి తగినట్లు బోధనా ప్రణాళికలు రూపొందించుకోవడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తంగా 12 మంది నోడల్‌ అధికారులు ఉన్నారు. మండలంలోని సీనియర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 29 మంది కాంప్లెక్స్‌ పాశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఆర్పీలుగా పనిచేయాల్సి ఉంది. వారు   48 మంది ఉన్నారు. ఆర్పీలు వీరందరూ పాఠశాలలో పాఠశాలు బోధించే వారే వీరు లేని కారణంగా విద్యాభివృద్ధి కుంటుంపడుతోంది. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సైతం ఉన్నాయి. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు.  పాఠశాలలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులందరూ నోడల్‌ అధికారులు గాను, ఆర్పీలుగాను పనిచేస్తున్నారు.  కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు సైతం ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నారు. మరో ప్రక్క ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఇన్ని సమస్యల మధ్యన తొలిమెట్టు ముందుక సాగుతుందా అనే సమస్య వెంటాడుతోంది.   శుక్రవారం అయిజ మండల  నోడల్‌ అధికారి శివశంకర్‌రెడ్డి తన మండలంలోని ఉత్తనూర్‌, ఈడ్గోనిపల్లి గ్రామాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో అమలవుతున్న తొలిమెటట్టు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉపాద్యాయుడు బోధించే పనితీరును పరిశీలించారు. 

 Read more