ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి

ABN , First Publish Date - 2022-12-12T23:13:15+05:30 IST

ప్ర భుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికా రులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు.

  ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలి
ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రం స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- ప్రజావాణిలో కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 12 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికా రులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌లో అన్ని శాఖ అధికారులతో కలిసి ప్రజా వాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ అనుకున్న విధంగా ప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని, 4, 5 శాఖలు తప్ప అన్ని కార్యాలయాల అధికారులు రికార్డ్‌లతో సహా నూతన కలెక్టరేట్‌ సమీకృత సముదాయం భవనా నికి సిఫ్ట్‌ కావడంపై అభినందనలు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి విన్నవిం చుకున్న దరఖాస్తు పై సంబంధిత శాఖల అధికా రులు దృష్టి కేంద్రీకరించాలని, సమస్య పరిష్కారం అవుతుందా.. లేదా అన్నది ఫిర్యాదుదారుడికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ఆదేశించారు. సమస్య పరిష్కారంపై హెచ్‌వోడీతో కానీ, లేదా తనతో గాని చర్చించి తుది నిర్ణయానికి రావాలని సూచించారు. సమీకృత భవన సముదాయంలో అధికారులతో పాటు సిబ్బందికి ఇక నుంచి బ యోమెట్రిక్‌ హాజరును ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అందరు సమయపాలనను పాటించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలను, చౌకధర దుకాణాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పథకా ల అమలు, గ్రామ, పట్టణ పురోగతికి సంబంధిత శాఖల అధికారులు కష్టపడి పని చేయాలని పున రుద్ఘాటించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, ప్రత్యేక కలెక్టర్‌ పద్మశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- ప్రజావాణికి 118 ఫిర్యాదులు

ప్రత్యేక సమావేశ అనంతరం కలెక్టర్‌ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరిన్ని ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులకు ఫార్వర్డ్‌ చేసి తనదైన శైలిలో హెచ్చరించారు. మొత్తంగా ప్రజావాణికి 118 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారు లు తెలిపారు. అందులోని కొన్ని ఈ విధానంగా ఉన్నాయి.

- నా భర్త నన్న వేధిస్తున్నాడని భూత్పూర్‌ మండలం ఎల్కిచెర్ల గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మా అమ్మనాన్న అడిగేందుకు వస్తే వారిపై కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి నా భర్త శ్రీను మందరికిని వేధిస్తున్నాడని వాపోయింది. ఈ విషయాలు విన్న కలెక్టర్‌ సఖీ సెంటర్‌ అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

- మా అమ్మ సావిత్రి ఎస్టీ హస్టల్‌లో కుక్కర్‌గా పని చేస్తూ 2022-ఫిబ్రవరి, 27న గుండెపోటుతో మరణించిందని ఆ ఉద్యోగం తనకే ఇవ్వాలని పాలమూరు పట్టణంలోని మర్లు ప్రాంతానికి చెందిన కల్పన అనే యువతి కలెక్టర్‌ను కోరింది. సర్వీస్‌ బుక్కులో ఎవరి పేరు రాసింటే వారే జాబ్‌కు అర్హులని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

- తన అన్న హన్మంతుకు రెండు కాళ్లు విరిగాయని దివ్యాంగుల పింఛన్‌ ఇప్పించాలని మహబూబ్‌నగర్‌ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి కలెక్టర్‌కు విన్నవించారు.

- మా చెల్లి శైలజ దివ్యాంగురాలని ఆమెకు ట్రై సైకిల్‌ ఇప్పించాలని నవాబ్‌పేట మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక కలెక్టర్‌తో కోరగా వెంటనే ట్రైసైకిల్‌ ఇచ్చేందుకు శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.

Updated Date - 2022-12-12T23:13:15+05:30 IST

Read more