గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

ABN , First Publish Date - 2022-10-01T05:19:26+05:30 IST

గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ జితేందర్‌రెడ్డి

- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి

బాలానగర్‌, సెప్టెంబరు 30 : గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ నియంత, కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెం డాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్‌లో నంబర్‌ వన్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లు, లైట్లు, సిలిండర్లు మాత్రమే దర్శనమిస్తున్నాయని తెలిపారు. మండల కేంద్రం నుంచి రేవల్లి రోడ్డు పరిస్థితి అధ్వానస్థితిలో ఉన్నా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధిలేదా అని ప్రశ్నించారు. దేశ యువత మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధి కారి శాంతకుమార్‌, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, జనార్దన్‌, నర్సింహులు, రామకృష్ణ, మల్లేష్‌, రాజు, శివకుమార్‌, శ్యాంసుందర్‌, శేఖర్‌గౌడ్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Read more