గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2022-03-18T05:42:48+05:30 IST

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తాం
ఎక్లాస్‌పూర్‌లో సీసీ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

 ఊట్కూర్‌, మార్చి 17 : కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో సీసీ రోడ్డు పనులను పూజ చేసి గురువారం ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామాలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమం నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

మరికల్‌ : మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి డ్రైనేజీ నిర్మాణానిక రూ.4 లక్షల ప్రొసిడింగ్‌ కాఫీని ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచ్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకళరెడ్డి, సర్పంచ్‌ పద్మమ్మ, నాయకులు చింతలయ్య, రాజవర్ధన్‌రెడ్డి, హన్మిరెడ్డి పాల్గొన్నారు.


Read more