-
-
Home » Telangana » Mahbubnagar » We need partners in forest protection-MRGS-Telangana
-
అటవీ రక్షణలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2022-09-12T04:49:25+05:30 IST
అటవీ రక్షణలో ప్రతీ ఒక్కరు భాగ స్వామ్యం కావాలని అటవీ సంరక్షణ అధికారి జోగుళాంబ సర్కిల్ ఐఎఫ్‌సీ శ్రీమతి క్షితిజ పిలుపునిచ్చారు.

- అటవీ సంరక్షణ అధికారి శ్రీమతి క్షితిజ
నారాయణపేట రూరల్, సెప్టెంబరు 11 : అటవీ రక్షణలో ప్రతీ ఒక్కరు భాగ స్వామ్యం కావాలని అటవీ సంరక్షణ అధికారి జోగుళాంబ సర్కిల్ ఐఎఫ్‌సీ శ్రీమతి క్షితిజ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఎక్లాస్పూర్ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై అమరవీరుల స్మారక చిహ్నానికి పుష్పగుచ్చం సమర్పించి మాట్లాడారు. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు ప్రాణాలు అర్పించిన 21మంది అమరులను స్మరిస్తూ వారి సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో అటవీశాఖ సిబ్బంది ప్రజా సహాకారం, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వన సేవకులకు కిట్ బ్యాగులను అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారిణి వీణావాణి, రేంజ్ అధికారి నారాయణరావు, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్, నీలేష్, జాకీర్, ఫక్రుద్దిన్, సంతోష్, నవీన్, విజయ, సిబ్బంది, వన సేవకులు పాల్గొన్నారు.