పోడు భూములకు పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2022-11-24T23:23:33+05:30 IST

ఎన్నో ఏళ్లుగా పోడు భూముల ను సాగు చేసుకుంటున్న వారికి తక్షణమే పట్టాలివ్వాల ని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 పోడు భూములకు పట్టాలివ్వాలి
పదరలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ

- తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

పదర, నవంబరు 24: ఎన్నో ఏళ్లుగా పోడు భూముల ను సాగు చేసుకుంటున్న వారికి తక్షణమే పట్టాలివ్వాల ని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పదర మండల తహసీల్దార్‌ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఇటీ వల చోటు చేసుకున్న అటవీశాఖ ఉద్యోగి శ్రీనివాసరావు హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇబ్బందిగా మారిన ధరణి పోర్టల్‌ను తక్షణమే రద్దు చేసి పాత విధానంలో భూ క్రయవిక్ర యాలు జరిగేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలతో నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రై తులందరికీ ఉచితంగా యూరియా అందిస్తామని చెప్పి న సీఎం హామీ ఏమైందని నిలదీశారు. అనంతరం డి మాండ్లతో వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.

ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి

పెద్దకొత్తపల్లి: ధరణి పోర్టల్‌ రద్దు చేయాలని పలువు రు డిమాండ్‌ చేశారు. పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంత రం బస్టాండ్‌ చౌరస్తా నుంచి తహసీల్దార్‌ కార్యాలయాని కి చేరుకొని ధర్నా చేపట్టారు. జగదీశ్వర్‌రావు వర్గానికి చెందిన వారు, రంగినేని అభిలాష్‌రావు వర్గానికి చెందిన వారు వేర్వేరుగా తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అనంతరం ఆర్‌ఐ శివన్నగౌడ్‌కు వినతి పత్రాలు అందజేశారు. కాంగ్రెస్‌ నాయకులు రంగినేని అభిలాష్‌రావు, సి.కృష్ణయ్య, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు పాపిరెడ్డి, మండల కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాసులు, ఎంపీటీసీ ఖాజా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గులాం రసూల్‌, నాయకులు మాడిచెట్ల శేఖర్‌, సంగం వెంకటస్వామి, మురళిధర్‌రెడ్డి, రాములు, శ్రీరాములు, నారాయణ, నరేష్‌, రామస్వామి, శివ, రమేష్‌, గుర్రాల బాలయ్య, సింగమాల్ల నర్సింహ్మ, గోపి, శ్రీను, ఎక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:23:35+05:30 IST