సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-27T05:36:33+05:30 IST

కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీజేపీ ఆధ్వర్యంలో అక్టోబరు 9 నుం చి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ఎల్లేని సుధాకర్‌రావు

కొల్లాపూర్‌, సెప్టెంబరు 26 :  కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీజేపీ ఆధ్వర్యంలో అక్టోబరు 9 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం కొల్లాపూర్‌ పట్టణంలోని లోటస్‌ మాన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ పరిధిలోని బీజేపీ ముఖ్య నాయకులతో ప్రగతి కోసం పాదయాత్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఎల్లేని మాట్లాడుతూ గడిచిన ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు పా లకులు అమలు చేయని హామీలను బీజేపీ ఆధ్వర్యంలో నిలదీసి అడిగేందుకే పాద యాత్ర నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కొల్లాపూర్‌ ప్రగతి కోసం పాదయాత్ర లేబుల్‌ను విడుదల చేశారు. కార్యకర్తలంతా పాదయా త్రకు తరలివస్తామని ఎల్లేని పోరాటానికి తమ మద్దతు తెలుపుతామని బహిరం గంగా వెల్లడించారు. అనంతరం పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి  ఎల్లేని సుధాకర్‌రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్‌ శ్రీనివాస్‌యాదవ్‌, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల శివు డు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌చంద్ర, మహిళా మోర్చా రాష్ట్ర కార్య దర్శి రోజారమణి, వివిధ మండలాల అధ్యక్షులు తమటం సాయికృష్ణగౌడ్‌, శ్రీధర్‌రె డ్డి, పదిర భీమేష్‌, రాకేష్‌, ఘనమోని పుల్లయ్య, అన్వేష్‌, ప్రసాద్‌, కొల్లాపూర్‌ నగర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Read more