వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాలి

ABN , First Publish Date - 2022-07-19T04:56:15+05:30 IST

రెవెన్యూ శాఖలో వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నారాయణపేట పుర పార్కు ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి వీఆర్వోలు ధర్నా నిర్వహించారు.

వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాలి
పురపార్కు ముందు ధర్నా నిర్వహిస్తున్న వీఆర్వోలు

నారాయణపేట, జూలై 18 : రెవెన్యూ శాఖలో వీఆర్వోలకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నారాయణపేట పుర పార్కు ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి వీఆర్వోలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌ మాట్లాడుతూ వీఆర్వోల వ్యవస్థ రద్దుచేసి 22 నెలలు గడుస్తు న్నా నేటికీ ప్రభుత్వం తమకు బాధ్యతలు అప్ప గించ లేదని విమర్శించారు. తమను రెవెన్యూ వ్యవస్థలోనే కొనసాగించాలని, తమను విధుల్లోకి తీసుకొని జాబ్‌ చార్జ్‌ అందించాలన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్‌ పద్మజారాణికి అందించారు. 

Read more