నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-09-30T05:03:25+05:30 IST

అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమించి క్లినిక్‌లు, ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు అన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
అనుమతులు లేని క్లినిక్‌ను సీజ్‌ చేస్తున్న డీఎంహెచ్‌వో

- డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు 

    

ఆత్మకూర్‌, సెప్టెంబరు 29: అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమించి క్లినిక్‌లు, ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్‌ పట్టణంలోని క్లినిక్‌ సెంటర్లు, డయాగ్నోస్టిక్‌, ఫిజియోథెరపీ కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని తెలిపారు. అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ఒక క్లినిక్‌ను, రెండు ఆర్శమొలల కేంద్రాలను సీజ్‌ చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే, వసతులు సరిగ్గా లేని కొన్ని క్లినిక్‌లకు నోటీసులు జారీ చేశారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధు, హెల్త్‌ అసి స్టెంట్‌ రాజేందర్‌, ఏఎస్సై బీచుపల్లి తనిఖీల్లో పాల్గొన్నారు.  

Read more