వినాయకా.. వీడ్కోలిక

ABN , First Publish Date - 2022-09-11T04:34:24+05:30 IST

గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు అశేష భక్తజన సందోహం మధ్య శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కొనసాగాయి.

వినాయకా.. వీడ్కోలిక
ద్వాపర యుగం అనంతరం కలియుగం ఆరంభం అలంకరణ

- భక్తజన సందోహం మధ్య నిమజ్జనం  

- అన్నదానాలు, నీటి సరఫరాతో సేవల జోరు 

నారాయణపేట, సెప్టెంబరు 10 : గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు అశేష భక్తజన సందోహం మధ్య శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కొనసాగాయి. పది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జన ఊరేగింపు గణేష్‌ మార్గ్‌ గుండా కొండారెడ్డిపల్లి చెరువు వరకు కొనసాగింది. దారి పొడవునా అడుగుల భజనలు, భక్తి పాటలు, కోలాటాలు, డప్పు మేళ తాళాల బృందాలతో యువకులు రంగులు చల్లుకుంటూ  అత్యంత శోభాయ మానంగా  వేడుకలు కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక నిమజ్జన అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. ని మజ్జనం సందర్భంగా భారీగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయగా ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌గౌడ్‌ పర్యవేక్షించారు. అంతకుముందు రోజు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ఉత్సవాలను ప్రారంభించగా దాదాపు 110 వినాయక విగ్రహాలకు పురపాలక సంఘం, వీహెచ్‌పీ ఆధ్వ ర్యంలో వేర్వేరుగా స్వాగతం పలికి పూజలు నిర్వహించి జ్ఞాపికలను అందజేశారు. శివాజీనగర్‌, గణేశ్‌ ఉత్సవ మిత్రమండలి, శక్తిపీఠం, షిరిడి సాయి, హనుమాన్‌ మందిర్‌ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయగా, శివాజీనగర్‌ లో మోచి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి జిల్లా కన్వీనర్‌ కాకర్ల భీమయ్య ఆధ్వర్యంలో సెంట్రల్‌ చౌక్‌లో తాగు నీటిని పంపిణీ చేశారు. నిమజ్జన వేడు కలను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ చంద్ర కాంత్‌, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కన్న జగదీశ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గందె చంద్రకాంత్‌, సరాఫ్‌ నాగరాజ్‌, కృష్ణ కోర్వార్‌, బండి శివరాంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బోయ లక్ష్మణ్‌, శ్రీపాద్‌, వినోద్‌, రాఘవేందర్‌రెడ్డి, శేఖర్‌, ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, సత్యయాదవ్‌, ప్రభాకర్‌వర్ధన్‌, వెంకట్రాములు, రఘురామయ్య, సత్యరఘు పాల్‌, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బాలస్వామి, వీహెచ్‌పీ నాయకులు లింగం రాములు, రాంలాల్‌, సీతారాములు, నర్సప్ప, హన్మంతు, దత్తుచౌద్రి, కౌన్సిలర్లు, కమిషనర్‌ సునీత, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంలోని పటేల్‌ రోడ్డులో ప్రతిష్టించిన వినాయకుడికి  శనివారం 11 రోజు జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, ఎస్‌ఐ అశోక్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు.  అన్నదానం కార్యక్రమం అ నంతరం గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నిర్వ హించారు. ఈ సందర్భంగా పుర వీధుల గుండా యువకులు రిక్డాంగ్‌ డాన్స్‌లు, కోలాటం భజన సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటు ఊరేగింపు నిర్వహించారు.  

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని ఆయా వీధుల్లో ప్ర తిష్టించిన గణనాథులను శనివారం రాత్రి నిమజ్జనానికి తర లించారు. అంతకుముందు  గణేష్‌ విగ్రహాల వద్ద లడ్డూ వేలం పాటలు, అన్నదాన కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా భజనలు, కోలాటం, దాండియా నృత్యాలు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పట్టణంలో శోభాయాత్ర కొనసాగనుంది. అనంతరం మక్తల్‌ పెద్ద చెరువులో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. 

ఆకట్టుకున్న అలంకరణలు

బురుడు వాడి ఆజాద్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ద్వాపర యుగం అనంతరం కలియుగం ఆరంభం అలంకరణ, బురుడు వాడి అజాద్‌ యూత్‌ యువజన సంఘం వారి సీతాదేవి జాడను జాంబ వంతుడి కి వివరిస్తున్న జఠాయువు అలంకరణ పలువురిని ఆకట్టుకున్నాయి. అంభాభవాని దేవాలయం వారి భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల అలంకరణ, భవసార క్షయత్రి సమాజం వారి వ్యాసుడు మహా భారతాన్ని వినాయకుడికి వివరిస్తుండగా లిఖిస్తున్న అలంకరణ, ఎస్‌ఎస్‌కే సమాజం వారి సమయానికి అనుగుణంగా మనిషిలో వచ్చే మా ర్పులను వివరిస్తున్న అలంకరణ, వంశీ యూత్‌ గోపాల్‌పేట వారి లక్ష్మణుడు రావణ కుమా రులను వధించే అలంకరణ, శ్రీరాంసాయి హజిఖాన్‌ పేట వారి త్రిశూలానికి ఊయల వేసిన పరమేశ్వరుడు ఆ ఊయలలో వినాయకుడు ఊగుతున్న అలంకరణ, థండర్‌ ఫ్రెండ్స్‌ అంబే డ్కర్‌ చౌరస్తా వారి సామ వేదసారం సంగీత నాట్యం అలంకరణ, ముదిరాజ్‌ యువ సేన వారి భక్త ప్రహ్లాదుని ఏనుగుతో హిరణ్య కశ్యపుడు తొక్కించే అలంకరణ, శాలివాహన సంఘం వారి సైకిల్‌ తొక్కుతున్న మట్టి వినాయకుడు, బారంబావి శివాలయం వారి షీటీమ్స్‌పై అలంకరణ, మహంకాళీ మందిర్‌ వారి రక్తబీజుడనే రాక్షసుడిని సంహ రిస్తున్న కాళిక మాత అలంకరణ, సాయి సూర్య ఫ్రెండ్స్‌ వారి కుంతి దేవి కర్ణుడిని నదిలోకి వదిలేస్తున్న అలంకరణ, టీచర్స్‌ కాలనీ వినాయక ప్రెండ్స్‌ ఆధ్వర్యంలో మహిళను గౌరవించు నినాదంతో సందేశాత్మక అలంకరణ చూపరులను ఎంగాతో ఆకట్టుకున్నాయి.

150 మంది పోలీసులతో బందోబస్తు

పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు

నారాయణపేట క్రైం : నారాయణపేటలో గణేశ్‌ నిమ జ్జన ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు ఎన్న డూ లేని విధంగా అతి తక్కువగా 150 మంది పోలీ సులతో ఎస్పీ వెంక టేశ్వర్లు బందోబస్తు ఏర్పాటు చేయ డం విశేషం. గతంలో 600 మంది పోలీసులతో బందో బస్తు నిర్వహించారు. వలం టీర్లను ఏర్పాటు చేసి వాహ నాల రాకపోకలకు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వినాయక శోభాయాత్రను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించారు. ఎక్కడ గొడవలకు తావు లేకుండా పోలీస్‌ శాఖ ప్రత్యేక కృషి చేయగా ఉత్సవ కమిటీ, యువజన సంఘాల నాయకులు పోలీసులకు సహకరించారు. 











Updated Date - 2022-09-11T04:34:24+05:30 IST