గ్రామాలు కూడా అవార్డులు సాధించాలి

ABN , First Publish Date - 2022-09-27T05:03:12+05:30 IST

భూత్పూర్‌ ము నిసిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావ డం చాలా అదృష్టమని, ఎంతో శ్రమతో అభివృద్ధి సాధించడం వల్లనే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు అర్హత సాధించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

గ్రామాలు కూడా అవార్డులు సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి

 - మునిసిపల్‌ చైర్మన్‌ను అభినందించిన

      ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ 

భూత్పూర్‌, సెప్టెంబరు 26:  భూత్పూర్‌ ము నిసిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావ డం చాలా అదృష్టమని, ఎంతో శ్రమతో అభివృద్ధి సాధించడం వల్లనే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు అర్హత సాధించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమ వారం మునిసిపాలిటీ పట్టణ కేంద్రంలో ఆంజనే యస్వామి దేవాలయం ఆవరణలో  ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మునిసిపాలిటీ చైర్మన్‌ బస్వరాజు గౌడ్‌, కమిషనర్‌ నురూల్‌నజీబ్‌, పాలకమండలి వర్గ సభ్యులను  ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినం దించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రా మాలు కూడా స్వచ్ఛ   సర్వేక్షణ్‌ అవార్డులకు ఎంపిక  కావాలని సూచించారు. అంతకు ముందు గిరిజన మహిళలు ఎమ్మెల్యేకు బతుక మ్మ సంబురాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మండలంలోని వెల్కిచర్ల, తాటి కొండ, పోతులమడుగు, హస్నాపూర్‌, అన్నసాగ ర్‌ గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చే శారు. ఆయా కార్యక్రమాల్లో పలు పార్టీల నా యకులు ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.  కార్యక్ర మంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేష్‌కుమార్‌గౌడ్‌, ముడా డైరెక్టర్లు సాయిలు, చంద్ర శేఖర్‌గౌడ్‌, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్‌చార్జి పర్పన్‌ సత్యనారాయణ, సింగిల్‌ విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌కోటి, రామకృష్ణ, నాయకులు నారాయణగౌడ్‌, మురళిధర్‌గౌడ్‌, సుకన్య, రాము నాయక్‌, శ్రీనునాయక్‌, రమేష్‌చందర్‌, సర్పంచు లు పద్మజక్కిరెడ్డి, బక్కిసాయికుమార్‌, రాముల మ్మ, కమలమ్మ,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more