ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-03-19T05:06:42+05:30 IST

మహ బూబ్‌నగర్‌ జిల్లా మన్యంకొండ అలివేలుమంగమ్మ వేంకటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కల్యాణం సందర్భంగా అమ్మవారి తాళిని భక్తులకు చూపుతున్న అర్చకులు


మహబూబ్‌నగర్‌ రూరల్‌, మార్చి 18: మహ బూబ్‌నగర్‌ జిల్లా మన్యంకొండ అలివేలుమంగమ్మ వేంకటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది. అర్చకుల మంగళశాసనాలు, భక్తుల జయజయధ్వానాలతో శాస్త్రోక్తంగా స్వామి, అమ్మ వారి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం భక్తుల కు స్వామి, అమ్మవారి దర్శనాలు కొనసాగించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి వి.శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజే శ్వర్‌గౌడ్‌, మునిసిపల్‌ ఛైర్మన్‌ కేసీ.నరసింహులు, ఎంపీపీ సుధాశ్రీ, వైస్‌ ఎంపీపీ అనిత, ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఆళహరి మధుసూదన్‌కుమార్‌, ఏసీ శ్రీనివాస్‌రాజు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ రాజే శ్వర్‌, కౌన్సిలర్‌ వనజ, మాజీ కౌన్సిలర్‌ జ్యోతి తది తరులు పాల్గొన్నారు. 

Read more