TS News: వెంకయ్య చేతుల మీదుగా జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-10-11T18:35:38+05:30 IST

లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ (Jaya 120వ జయంతి వేడుకలు మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగాయి.

TS News: వెంకయ్య చేతుల మీదుగా జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

మహబూబ్‌నగర్: లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ (Jaya Prakash Narayan) 120వ జయంతి వేడుకలు మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగాయి. ఈ సందర్బంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) చేతుల మీదుగా మాజీ కేంద్రమంత్రి దివంగత జైపాల్ రెడ్డి (Jaipal Reddy) విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ,  జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు, స్థానిక నేతలు హాజరయ్యారు.


ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీలో 18 నెలల జైలు జీవితంతో తన రాజకీయ జీవన గమనమే మారిపోయిందన్నారు. తాను జైపాల్ రెడ్డి ఇద్దరం జాతీయవాదులమేనని, అయినా సిద్దంతపరంగా భిన్నమైనవాళ్లమన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలే తప్ప శత్రువులుగా ఉండకూడదన్నారు. సభలో ఉన్నత ప్రమాణాలుండాలని, డిక్సస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కాని డిస్ట్రబ్ చేయకూడదన్నారు. ఉన్నత ప్రమాణాలు, సిద్ధాంత నిబద్దత రాజకీయాల్లో లోపించాయన్నారు. రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు, నీతి నిజాయితీ అవసరమన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, కష్టపడి, శ్రమిస్తే, పట్టుదల ఉన్నవారెవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని అన్నారు.


విద్యార్థులు కలలు కనండి.. కష్టపడండి..సాకారం చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. విద్యార్థులు ఇష్టపడి-కష్టపడండి.. భవిష్యత్తులో గొప్పవాళ్లవుతారన్నారు. పాఠశాలల్లో ప్రాధమిక స్థాయి విద్య వరకు మాతృభాషలోనే కోరుకునే వ్యక్తినని, కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరిచినవాడు మానవుడే కాదన్నారు. మాతృభాషను ప్రేమించాలని, ఇతర భాషలను గౌరవించాలన్నారు. జైపాల్ రెడ్డి అనర్గలమైన ఇంగ్లీష్ మాట్లాడే వారని, అయినా తెలుగులో మాట్లాడేందుకే ఇష్టపడేవారన్నారు. భారతీయ భాషలను గౌరవించాలని, జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-11T18:35:38+05:30 IST