పండుగలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-17T05:44:48+05:30 IST

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శాంతినగర్‌లో పండుగ వాతావరణాన్ని తలపించాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత ఆనందం వ్యక్తం చేశారు.

పండుగలా వజ్రోత్సవాలు
వజ్రోత్సవాల సభలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత 

- అట్టహాసంగా ప్రారంభమైన వేడుకలు 

- సెప్టెంబరు 17న తెలంగాణకు స్వాతంత్య్రం : అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- శాంతినగర్‌లో భారీ ర్యాలీ

- అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

వడ్డేపల్లి, సెప్టెంబరు 16 : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శాంతినగర్‌లో పండుగ వాతావరణాన్ని తలపించాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత ఆనందం వ్యక్తం చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారు లు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం, శాంతి పావురాలు, మూడు రంగుల బెలూన్లను ఎగురవేశారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్యే అబ్ర హాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడ్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక  ఇతర పార్టీలు మండిపడుతున్నాయన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్‌ సాయిచంద్‌ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌తో సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో నాయకులు సీతారామిరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి, వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత, ఎంపీపీ రజిత, అశోక్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్‌లు, ఆర్డీవో రాములు, సీఐలు, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.  


మండలాల నుంచి తరలివచ్చిన ప్రజలు

గట్టు : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి గట్టు మండలం నుంచి మహిళలు అధికసంఖ్యలో తరలివెళ్లా రు. మండలానికి కేటాయించిన ఏడు బస్సుల్లో మహిళ లు గద్వాలకు చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్ర మంలో ఐకేపీ సిబ్బంది, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సమైక్యత కోసమే వజ్రోత్సవాలు

అయిజ టౌన్‌ : జాతీయ సమైక్యత కోసమే రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని మునిసిపల్‌ కమిషనర్‌ నర్సయ్య అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కోసం శుక్రవారం శాంతినగర్‌లో నిర్వహిం చిన భారీ ర్యాలీకి అయిజ నుంచి కమిషనర్‌ నర్సయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌, ఏఈ గోపాల్‌, లక్ష్మన్న రమేష్‌, ఆర్‌పీలు, మహిళా సంఘాల మహిళలు, ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


రాజోలి : వజ్రోత్సవాల్లో భాగంగా శాంతినగర్‌ మునిసిపాలిటీలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొనేం దుకు రాజోలి నుంచి రెండు బస్సుల్లో అధికారులు, ప్రజలు తరలివెళ్లారు. ఎంపీపీ మరియమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, సర్పంచు వెంకటేశ్వరమ్మ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యు డు షాషావలి, ఎంపీడీవో గోవిందురావు, నాయకులు న తానియేలు, శ్రీరామ్‌రెడ్డి, గంగిరెడ్డి, గోపాల్‌ పాల్గొన్నారు.


మానవపాడు : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శాంతినగర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీకి మానవపాడు మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, అధికారులు, ప్రజలు తరలివెళ్లారు. ప్రభు త్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో పంచాయతీ కార్య దర్శుల ఆధ్వర్యంలో వారు శాంతినగర్‌కు చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు.Read more