పారదర్శకంగా ఓటరు జాబితా

ABN , First Publish Date - 2022-12-06T22:56:54+05:30 IST

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఓటరు జాబితా స్పెషల్‌ సమ్మరీ రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాస్‌రాజు తెలిపారు.

పారదర్శకంగా ఓటరు జాబితా
కలెక్టర్‌ వల్లూరు క్రాంతితో మాట్లాడుతున్న రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాసరాజు

- రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాస్‌రాజు

- 10వ బెటాలియన్‌లో ఓటరు నమోదు పరిశీలన

- పాల్గొన్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

ఎర్రవల్లి చౌరస్తా, నవంబరు 6 : అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఓటరు జాబితా స్పెషల్‌ సమ్మరీ రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాస్‌రాజు తెలిపారు. ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ బెటలియాన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన 14, 15 పోలింగ్‌ బూత్‌లను మంగళవారం అయన పరిశీలించారు. బూత్‌ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటరు నమోదు పక్రియ కొనసాగుతున్న తీరును తెలుసుకున్నారు. మరణించిన, శాశ్వతంగా వలసలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను ఒకటికి రెండుసార్లు క్షేత్ర స్థాయిలో విచారించి జాబితా నుంచి తొలగించాలన్నారు. బెటలియాన్‌ పోలీస్‌ ఉద్యోగులు బదిలీపై వెళ్లారని, వారి పేర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎర్రవల్లి సర్పంచు రవి కోరారు. కామండెంట్‌తో అధికారిక సమాచారం సేకరించి, స్థానికంగా లేనివారిని గుర్తించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి సూచించారు. స్థానికంగా, ఉద్యోగుల కుటుంబ సభ్యులు లేకపోయినా తొలగించాలన్నారు. తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఆర్టీఏ పురుషోత్తం, ఎంవీఐ చక్రవర్తిగౌడు, నరసింహస్వామి, మానస, స్వప్న, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ ప్రశాంత్‌ గౌడు పాల్గొన్నారు.

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

గద్వాల క్రైం : అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని స్పెషల్‌ సమ్మరీ రాష్ట్ర పరిశీలకుడు శ్రీనివాసరాజు అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వారికి ఎపిక్‌కార్డును వెంటనే మంజూరు చేస్తారని తెలిపారు.

Updated Date - 2022-12-06T22:56:55+05:30 IST