-
-
Home » Telangana » Mahbubnagar » Training on Dalit Relatives from 19 Collector-MRGS-Telangana
-
19 నుంచి దళిత బంధుపై శిక్షణ : కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-17T05:26:37+05:30 IST
దళిత బంధు పథకంపై ఈ నెల 19 నుంచి 23 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.

మహబూబ్‌నగర్ (కలెక్టరేట్), మార్చి 16 : దళిత బంధు పథకంపై ఈ నెల 19 నుంచి 23 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఈ విషయమై బధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సెక్టోరల్ అధికారులతో సమా వేశం నిర్వహించారు. 19న థియరీ తరహాలో శిక్షణనిస్తూ 22, 23 తేదీల లోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పారు. శిక్షణ కార్యక్రమాల అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ముఖ్యంగా దళితబంధు పథకాన్ని బాగా అమలు చేసిన పరిశ్రమ లేదా ఇతర యూనిట్లను ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. మన జిల్లాలో కూడా ఇలాంటి యూనిట్లు విజయవంతంగా అమలు చేసేందుకు ఈ క్షేత్రస్థాయి పర్యటన ఉపయోగపడుతుందని, ఆ విధం గా అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. దళితబంధు పథకం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు అవసరమైతే ప్రైవేటు ప్రొఫెసర్‌లను కూడా పిలిపించాలని, శిక్షణ స్పష్టంగా ఉండాలని, దళిత బంధు ఇచ్చే యూనిట్లు పనికొచ్చే విధంగా గ్రౌండ్ అయ్యేలా ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టంగా ఉండటమే కాకా, క్షేత్ర స్థాయి పర్యటనకు కూడా అవస రమైన కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారిగా, సెక్టార్ల వారీగా తయారు చేయాల్సిన శిక్షణ మాడ్యూల్స్ తదితర అంశాలపై కలెక్టర్ సూచనలు ఇచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, జడ్పీ సీఈఓ జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, డీటీడబ్ల్యూ, ఆర్టీఓ నరేష్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.