ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టుకు పాత ఎంపీడీవో భవనం అప్పగింత

ABN , First Publish Date - 2022-05-19T05:13:25+05:30 IST

జిల్లా కేంద్రంలోని గద్వాల పాత ఎంపీడీవో కార్యాలయ భవ నాన్ని ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌, సెషన్స్‌ కోర్టు నిర్వహణ కోసం బుధవారం ఎంపీడీవో చెన్నయ్య జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు శోభారాణి, కార్యదర్శి మధుసూ దన్‌బాబులకు అప్పగించారు.

ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టుకు  పాత ఎంపీడీవో భవనం అప్పగింత
ఆర్డర్‌ కాపీని అందిస్తున్న ఎంపీడీవో చెన్నయ్య

 గద్వాల, మే 18: జిల్లా కేంద్రంలోని గద్వాల పాత ఎంపీడీవో కార్యాలయ భవ నాన్ని ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌,  సెషన్స్‌ కోర్టు నిర్వహణ కోసం బుధవారం ఎంపీడీవో చెన్నయ్య జిల్లా బార్‌ అసోసియేషన్‌  అధ్యక్షురాలు శోభారాణి, కార్యదర్శి మధుసూ దన్‌బాబులకు అప్పగించారు. కలెక్టర్‌ ఆదేశం మేరకు ఈ భవనాన్ని వారికి అప్ప గించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఇప్పటికే  పీఏసీఎస్‌, ఎస్సీ సంక్షేమ కార్యాల యా లు ఉన్నాయి. అందులోని పీఏసీఎస్‌ కార్యాలయాన్ని తిరిగి వారి పాత భవనంలోకి మార్చాలని, ఎస్సీ సంక్షేమ కార్యాలయాన్ని సెకెండ్‌ రైల్వేగేట్‌ సమీపంలోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఇక నుంచి మండల, జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలను పాత సమావేశం భవనంలో కాకుండా కొత్త భవనంలోనే ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు ఎంపీఈవో తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆనంద్‌ గౌడ్‌, మనోహర్‌, సత్యారెడ్డి, రాజేశ్వర్‌, పూజారి శ్రీధర్‌, ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి ఉన్నారు.  

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలోని పాత బిల్డింగ్‌ను గద్వాల జిల్లా  ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌, సెషన్స్‌ కోర్టుకు కేటాయించేందుకు సహకరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిని బుధవారం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా బోకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు శోభారాణి, కార్యదర్శి మధుసూదన్‌బాబు,  ఏజీపీ కృష్టారెడ్డి,  న్యాయవాదులు మనోహర్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, త్రిపాఠీ, మణిధర్‌గౌడ్‌ ఉన్నారు.

Read more