వేసవిలో విద్యుత్‌ అంతరాయం ఉండరాదు

ABN , First Publish Date - 2022-12-09T23:57:42+05:30 IST

వేసవికాలంలో ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేయటంలో ఎలాంటి ఇబ్బంది ఉండరాదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి విద్యుత్‌ సిబ్బం దిని ఆదేశించారు.

వేసవిలో విద్యుత్‌ అంతరాయం ఉండరాదు
సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న విద్యుత్‌ శాఖ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి

- టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి

పాలమూరు, డిసెంబరు 9 : వేసవికాలంలో ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేయటంలో ఎలాంటి ఇబ్బంది ఉండరాదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి విద్యుత్‌ సిబ్బం దిని ఆదేశించారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యుత్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఎనర్జి ఆడిట్‌ డైరెక్టర్‌ రాము లు, కమర్షియల్‌ డైరెక్టర్‌ గంప గోపాల్‌తో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రైతుల కు వ్యవసాయానికి నెలకు రూ.30లు మాత్రమే నామినల్‌గా వసూలు చేయాల్సినవాటిని పెండింగ్‌ పెట్టకుండా వసూలు చేయాలన్నారు. రైతులకు పంటు చేతికొచ్చిన సమయంలోనే ఈ బిల్లులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ను సరఫరా చేయటంతో రెవెన్యూ వందశాతం కలెక్షన్స్‌ చేయాలన్నారు. సిబ్బంది శక్తి వం చనలేకుండా పనిచేసి సంస్థ మనుగడకు పనిచేయాలన్నారు. వేసవికాలంలో విద్యుత్‌ సర ఫరాలో ఇబ్బందులు వస్తాయనే దానిపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్‌.ఈలు ఎన్‌.శ్రీరామమూర్తి, ప్రభాకర్‌రావు (నారాయణపేట), భాస్కర్‌(గద్వాల), నరేంద్రకుమార్‌ (వనపర్తి), లీలావతి (నాగర్‌కర్నూల్‌), డీఈటీ చంద్రమౌళి, డీఈలు, ఎస్‌ఏఓలు, ఏఓలు, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:57:45+05:30 IST