‘మన ఊరు - మన బడి’ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T23:12:30+05:30 IST

మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వార పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు.

‘మన ఊరు - మన బడి’  పనులు పూర్తి చేయాలి
పెద్దపొర్ల పాఠశాలలో విద్యార్థిని చేత లెక్కలు చేయిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ శ్రీహర్ష

ఊట్కూర్‌ డిసెంబరు 13 : మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వార పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తిప్రస్‌పల్లి, మల్లెపల్లి, చిన్నపొర్ల, ఎడవెల్లి, పెద్దపొర్ల, బిజ్వార్‌ గ్రామ పాఠశాలలను తనిఖీ చేసి మౌలిక సదుపాయ కల్పన, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. వాటర్‌ సంప్‌, లైటింగ్‌, ప్రహారి నిర్మాణంతో పాటు ఇతర పనులను వెంటనే పూర్తి అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల పనులు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపొర్ల ఉన్నత పాఠశాలలో పనులు పూర్తి అయిన రికార్డు చేయకపోవడంపై ఏఈ రఫీని నిలదీశారు. రెండు రోజుల్లో రికార్డు పూర్తి చేయకపోతే వేతనాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. అదనపు గదుల పనులు నిలిచిపోయాయని సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి చెప్పడంతో రెండు పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన అదనపు గదుల నిధుల అంచన రిపోర్టును తయారు చేసి ఇవ్వాలని ఏఈ జగత్‌చంద్రను ఆదేశించారు. ప్రాఽథమిక పాఠశాల హెచ్‌ఎంతో మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంత మందికి చదవడం, రాయడం వస్తుందని అడగా 60శాతం అని చెప్పడంతో వందశాతం మందికి చదవడం, రాయడం రావాలని సూచించారు. చిన్నపొర్ల, పెద్దపొర్ల ప్రాథమిక పాఠశాలల్లోని 4, 5వ తరగతుల్లో గణిత పాఠం బోధన జరుగుతుండగా విద్యార్థులకు తన చేతి గడియారం చూపించి 24 గంటలు 12 గంటల మధ్య వ్యత్యాసంతో పాటు గుణింతాలు చేయమని చెప్పగా విద్యార్థులు చేయడంతో వారిని అభినందించారు. అదే విధంగా జిల్లా స్థాయి సైన్స్‌ ఫేయిర్‌లో ప్రతిభ చాటిన మల్లెపల్లి, బిజ్వార్‌ గ్రామాల విద్యార్థులకు కలెక్టర్‌ అభినందించారు. జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, జిల్లా సెక్టోర్‌ అధికారి శ్రీనివాస్‌, డీఈ రాము, ఎంపీడీవో కాళప్ప, ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, ఏఈ రఫీ, జగత్‌చంద్ర, వెంకటేష్‌ ఏపీవో ఎల్లప్ప, ఈసీ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, మాణిక్యమ్మ, రవికుమార్‌, సావితమ్మ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:12:32+05:30 IST