భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు

ABN , First Publish Date - 2022-09-30T05:06:36+05:30 IST

ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా, వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందిందని, ప్రధాని నరేంద్రమోదీ పాలనతో ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు ఉందని బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు
సదస్సులో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

- ప్రధాని మోదీ పాలనలో వేగంగా దేశాభివృద్ధి

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

గద్వాల, సెప్టెంబరు 29 : ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా, వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందిందని, ప్రధాని నరేంద్రమోదీ పాలనతో ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు ఉందని బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణం లోని ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో గురువారం మేధావు ల సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర సీని యర్‌ నాయకుడు నాగూర్‌ నామోజీరావు హాజర య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకింగ్‌ వ్వవస్థ మెరుగు పడటంతో పాటు ఎగుమతులు పెరిగాయని, తద్వారా విదేశీమారక ద్రవ్య నిల్వలు పెరిగాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంటే, భారత్‌ లో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని వివరించారు. అంతర్గత భద్రత విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ రాజీ పడకుండా పాలన సాగిస్తున్నదని, దీంతో 77 శాతం వామపక్ష తీవ్రవాదం, ఎనిమిది శాతం ప్రాణనష్టం తగ్గిందని వివరించారు. సరి హద్దు భద్రతలో ప్రధాని నరేంద్ర మోదీ  వేగవం తమైన చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఢోక్లాంలో చైనాకు ధీటుగా ఎదురు నిలిచిన భారత్‌ ను చూసి యావత్‌ ప్రపంచం అబ్బుర పడిందని కొనియాడారు. కరోనా సమయంలో సమయ స్పూర్తిగా వ్వవహరించడంతో అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌లో ప్రాణనష్టం అతి తక్కువగా నమోదు కావడం మోదీ కృషి వల్లనే సాధ్య మైందని వివరించారు. అతి త్వరగా వ్యాక్సిన్‌ను కనుగొని ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసి నట్లు తెలిపారు. మేధావుల మౌనం దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే తదితరులు పాల్గొన్నారు.


అమ్మవారికి ప్రత్యేక పూజలు

    గద్వాల టౌన్‌ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలోని అన్నపూర్ణా దేవి ఆలయంలో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆమెకు ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌, బాలస్వామి, ఆర్‌ఆర్‌ శ్రీనివాసులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, టి.రామాంజనేయులు,  వెంకటేశ్వర్‌ రెడ్డి, తుమ్మల నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T05:06:36+05:30 IST