పట్టణాన్ని సుందరీకరణ చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T23:10:45+05:30 IST

జిల్లా కేంద్రాన్ని సుందరీకరణ చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

పట్టణాన్ని సుందరీకరణ చేయాలి
సమావేశంలో పాల్గొన్న సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 13 : జిల్లా కేంద్రాన్ని సుందరీకరణ చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పుర అధికారులతో సమీక్షించి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి వీరసావర్కర్‌ చౌరస్తాలో రోడ్డు పనులను వేగవంతం చేసి వాకింగ్‌ ట్రాక్‌, లైటింగ్‌ ఏర్పాటు, మురుగు కాల్వల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో పార్కు పనులను చేపట్టాలని, సత్యసాయికాలనీలో వృద్ధుల పార్కును వినియోగంలోకి తేవాలని, బస్టాండ్‌ ముందు నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా అటవీ అధికారి వీణవాణి, పుర కమిషనర్‌ సునీత, ఇంజనీయర్లు విజయ్‌, భాస్కర్‌, ఏఈ మహేష్‌, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

చిన్నపిల్లల ప్రమాణాలు నమోదు చేయాలి..

అంగన్‌వాడికి వచ్చే చిన్నారుల ప్రమాణాలను తన బుక్‌లెట్‌లో నమోదు చేసేలా చూడాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్లఓ సీడీపీవో, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. అంగన్‌వాడీ టీచర్లు సమయానికి వస్తున్నారా? లేదా? మీరు మానిటరింగ్‌ చేయాలని, స్యామ్‌మ్యాం పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టి వారి ఎదుగుదలకు కావాల్సిన పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. పిల్లల మానసిక శారీరిక అభివృద్ధి, వారి ఎదుగుదలకు సంబంధించి వివరాలను కార్డులో నమోదు చేశారా? లేదా? పరిశీలించాలని సూచించారు. డీడబ్ల్యూవో వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో రాణించాలి..

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు. రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలలో గెలుపొందిన ధన్వాడకు చెందిన క్రీడాకారులు బాలమని, నాగలక్ష్మిని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అభినందించారు. రంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ తెలంగాణ కేసరి రెజ్లింగ్‌ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచి సిల్వర్‌, రెండు బ్రాంజ్‌ మెడల్స్‌ కైవసం చేసుకోగా బాలమని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. డీఈవో, జిల్లా యువజన మరియు క్రీడల శాఖాధికారి గోవిందరాజులు, జీసీడీవో పద్మనలిని, కోచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:10:45+05:30 IST

Read more