ఐదు లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-18T04:23:39+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న ఐదు లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ అన్నారు.

ఐదు లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యం

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), ఆగస్టు 17 : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న ఐదు లక్షలు మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంపై బుధ వారం రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్ని జిల్లాల కలె క్టర్లు, అటవీశాఖ అధికారులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష, సమావేశం నిర్వహించారు. మూడు మునిసిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు, మండ లాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్‌డీవో యాదయ్య, డీసీవో వెంకటేశ్వర్లు, అడిషనల్‌ పీడీ జకియాసుల్తానా, మునిసిపల్‌ కమిషనర్లు ప్రదీప్‌కుమార్‌, నూరుల్‌ నజీబ్‌, మహమూద్‌ షేక్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీధర్‌, డీఈ మనోహర్‌, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.


నేడు ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నేడు (గురువారం) ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు తెలిపారు. ఫ్రీడం కప్‌ క్రీడాపోటీలలో భాగంగా గురువారం కేసీఆర్‌ ఎకో అర్బన్‌ పార్క్‌లో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీల ఏర్పాట్ల విషయమై బుధవారం ఆయన తన చాంబర్‌లో సంబంధి త జిల్లా అధికారులతో సమావేశమై చర్చించారు. క్రీడా పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఆయన అధికారులను ఆదేశించారు. సీనియర్స్‌, జూ నియర్స్‌ రెండు విభాగాలు, పురుషులు, మహిళలు రెండు విభాగాలలో పోటీలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశానికి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, జిల్లా పశుసంవంర్ధక శాఖ అధికారి మధుసూదన్‌, డీపీవో వెంకటేశ్వ ర్లు, జడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శంకరాచారి, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఇందిర, డీఎస్‌వో వనజాత, కలెక్టరేట్‌ ఏవో కిషన్‌ పాల్గొ న్నారు. ఈ విషయమై అంతకు ముందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ మాట్లాడుతూ గడిచిన నాలుగు రోజుల నుంచి గ్రామ, మండల స్థాయిలో పోటీలు నిర్వహించారని, ఇప్పుడు జిల్లా స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు.


నేడు సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 17 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను గురువారం అధికారికంగా నిర్వహిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్‌లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మొదటిసారి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యఅతిఽథిగా హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలోని అధికారులు. గౌడజాతి పెద్దలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, గీతా పారిశ్రామిక సొసైటీ సభ్యులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో...

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో ఉదయం 10.30గంటలకు సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అఽధి కారి ఇందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఇంన్‌చార్జి కలెక్టర్‌  తేజస్‌నందలాల్‌ పవర్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు. జిల్లా లోని కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. 


19, 20 తేదీల్లో కృష్ణాష్ఠమి వేడుకలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 17 : స్థానిక పద్మావతి కానీలోని మురళీకృష్ణ మం దిరంలో కృష్ణాష్ఠమి వేడుకలు ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహిస్తున్నట్లు దేవాలయం ఉత్స వ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న ఉదయం అభిషేకం, అలంకరణ, అఖండ దీపారాధన, పుణ్యహా వచనం, మహా నైవే ద్యం, మంగళహారతి, నిరవధిక దర్శనం, ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. 20న కలశాభిషేకం, పంచామృతభిషేకం, శుద్ధోదక స్నాపన, తులసిదళ, పూల అర్చన, విషు ్ణసహస్ర నామ పారాయణం, అలంకరణ, నిరవధిక దర్శనం ప్రసాద వితరణ, సాయంత్రం మురళీకృష్ణ రథోత్సవం, మురళీకృష్ణ మందిరము నుంచి ముఖద్వారం వరకు ఉంటుందని తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు మురళీకృష్ణ మందిర ముఖద్వారం దగ్గర ఉట్లు కొట్టడం, అనంతరం రథోత్సవం, సత్సంగ భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 


చంద్ర గురుస్వామి మందిరంలో

 19వ తేదీన స్థానిక రాంమందిర్‌ చౌరస్తాలోని చంద్రగురుస్వామి మందిరంలో కృష్ణజయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు

బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. 

Read more