ఎంసెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-19T05:12:11+05:30 IST

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ సోమవారం ప్రారంభమైంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎంసెట్‌ ప్రారంభం

పాలమూరులో రెండు కేంద్రాల్లో నిర్వహణ

11 మంది విద్యార్థులు గైర్హాజరు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూలై 18: ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ సోమవారం ప్రారంభమైంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్‌లో గల జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలో కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్న నిబంధనతో విద్యార్థులు కేంద్రాలకు గంటన్నర ముందే చేరుకున్నారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,890 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు జయప్రకాష్‌ నారాయణ్‌ కళాశాలలో 402 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 396 మంది హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరు అయ్యారు. ఫాతిమా విద్యాలయంలో 300 మంది హాజరు కావల్సి ఉండగా, 295 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరు అయ్యారు. కేంద్రాలను ప్రత్యేక స్క్వాడ్‌ బృందాలు, పరీక్ష నిర్వాహకులు పర్యవేక్షించారు.

Read more