పాలనా సౌలభ్యం కోసమే కొత్త మండలాలు
ABN , First Publish Date - 2022-11-30T23:24:35+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం అనేక కొత్త మండలాలను ఏర్పాటు చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గుండుమాల్, కొత్తపల్లి మండల కేంద్రాలు ప్రారంభం
కోస్గి/మద్దూరు, నవంబరు 30 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం అనేక కొత్త మండలాలను ఏర్పాటు చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన గుండుమాల్, కొత్తపల్లిని మండలాలను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గుండుమాల్, కొత్తపల్లి మండలాలను ప్రారంభించడానికి బుధవారం వారు మండల కేంద్రాలకు వచ్చారు. మంత్రి ఎంపీతో పాటు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుండుమాల్, కొత్తపల్లిలో నూతన తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ అధికారి కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. జిల్లా ఏర్పడిన అతి తక్కువ కాలంలో కొత్తపల్లి, గుండుమాల్ రెండు మండలాలతో 13 మండలు అయ్యాయన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రెవెన్యూతో పాటు ఇతర పనులకు ఇక్కడే చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ఎదుగుదలకు కృషి చేస్తోందన్నారు. భూముల రిజిస్ర్టేషన్‌కు సుదూరంగా వెళ్లేవారని, ఇప్పుడు తమ గ్రామాల్లోనే అన్ని కార్యాలయాలు వచ్చాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు మయాంక్ మిట్టల్, పద్మజారాణి, కోస్గి తహసీల్దార్ మమత, ఎంపీపీ మధుకర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Read more