-
-
Home » Telangana » Mahbubnagar » The issues of VRs should be resolved-MRGS-Telangana
-
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-08-18T04:28:49+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలకు జీవో విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు.

వనపర్తి టౌన్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలకు జీవో విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ఆయన బుధవారం మ ద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడం బాఽధాకరమన్నారు. వీఆర్ఏల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని, లేకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు జూనియర్ కళాశాల మైదానం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వీఆర్ఏలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు గోపాలకృష్ణ, వీఆర్ఏల సంఘం నాయకులు తిరుపతి, సురేష్, రమేష్, రాములు, అశోక్, భాగ్యలక్ష్మి, సోని, లక్ష్మి పాల్గొన్నారు.