ఆదర్శం సావిత్రీబాయి ఫూలే

ABN , First Publish Date - 2022-01-04T04:39:55+05:30 IST

నేటి మహిళలకు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.

ఆదర్శం సావిత్రీబాయి ఫూలే
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌; చిత్రంలో కలెక్టర్‌ వెంకట్రావు

మహిళ చదువుకుంటే కుటుంబమంతా చదువుకున్నట్లే

విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు


పాలమూరు, జనవరి 3: నేటి మహిళలకు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి, నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఒకప్పుడు మహిళలు చదువుకుంటే అరాచకాలు సృష్టించే వారని, చెవుల్లో సీసం పోసేవారని చెప్పారు. వాటన్నింటిని రూపుమాపేందుకు మహాత్మాజ్యోతిబా ఫూలే తన భార్యను చదివించి, మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారన్నారు. మహిళల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతా యన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబమంతా చదువుకున్నట్లేనని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, వైస్‌ చైర్మన్‌ టి.గణేష్‌, గ్రంథాలయ చైర్మన్‌ వి.రాజేశ్వర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, రాయికంటి రాందాసు, పూలే సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ప్రజా సంఘాల ఆధ్వర్యంలో

కేవీపీఎస్‌, తెలంగాణ మాల మహానాడు, మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌, జేవీవీ, చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో, జిల్లా కేంద్రంలోని పలుచోట్ల సావిత్రీబాయి ఫూలే 191వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళల చదువుకోసం ఆమె చేసిన త్యాగాన్ని కొనియాడారు. స్త్రీల విద్య ప్రదాతగా సావిత్రీబాయిని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి నరసింహయ్య, కె.రమేష్‌, మాణిక్యం రాజు, కావలి కృష్ణయ్య, సింగిరెడ్డి పరమేశ్వర్‌, ఎల్‌.రమేష్‌, కె.శ్రీదేవి, బి.అశోక్‌గౌడ్‌, డా.సుధ, ప్రగతి, వామాన్‌, విద్యుల్లత పాల్గొన్నారు. 

Read more