అఽధికారుల సహకారం ఎంతో..

ABN , First Publish Date - 2022-07-06T05:16:59+05:30 IST

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

అఽధికారుల సహకారం ఎంతో..
జడ్పీ చైర్‌పర్సన్‌ను సన్మానిస్తున్న ఉద్యోగులు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి

- పదవి చేపట్టి మూడేళ్ల సందర్భంగా సన్మానం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 5 : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ క్వార్టర్‌లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్క రించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ప్రసంగిస్తూ పదవి చేపట్టి మూడేళ్లు అవుతున్నదని అన్నారు. తనకు అందరు మంచి సహకారం అందిస్తున్నారని తెలిపారు. పాలక మండలి సభ్యుల సహకారం ఎంతో ఉందని, ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు యాదయ్య, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సీఈఈవో జ్యోతి, డిప్యూటీ సీఈవో మొగలప్పతో పాటు పలువురు జడ్పీటీసీ సబ్యులు, కో-ఆప్షన్‌ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Read more