ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-06T23:13:45+05:30 IST

విద్యార్థులు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తున్న విద్యార్థులు

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- ముగిసిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌, వైజ్ఞానిక ప్రదర్శన

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 6 : విద్యార్థులు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌, వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం ముగియగా మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మజారాణి పాల్గొని ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. డీఈవో గోవింద రాజులు, సైన్స్‌ అధికారులు భానుప్రకాష్‌, యాదయ్య, రమేష్‌, ఎంఈవోలు,

విజేతలు వీరే.

ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సీనియర్స్‌ విభాగంలో దయానంద విద్యామందిర్‌ ప్రథమ బహుమతి గెలుపొందగా, అక్షర స్యూల్‌ మక్తల్‌ ద్వితియ బహుమతి గెలుపొందారు. జూనియర్‌ విభాగంలో ఎంపీ యూపీఎస్‌ సింగారం ప్రథమ బహుమతి, జడ్పీహెచ్‌ఎస్‌ బోగారం ద్వితీయ బహుమతి, ఇకో ఫ్రెండ్లీ మెటిరీయల్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ పర్లేల్ల ప్రథమ బహుమతి, టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ దామరగిద్ద ద్వితీయ బహుమతి, జూనియర్‌ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ పూలిమామిడి ప్రథమ, జడ్పీహెచ్‌ఎస్‌ క్యాతన్‌పల్లి ద్వితీయ బహుమతి గెలుపొందారు. హెల్త్‌, క్లీన్‌నెస్‌ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్‌ బోగారం ప్రథమ, ద్వారకా స్కూల్‌ ద్వితియ బహుమతి, జూనియర్స్‌లో గ్రౌండ్‌ స్కూల్‌ పేట, ఎంపీ యూపీఎస్‌ నిడుగుర్తి, ట్రాన్స్‌పోర్ట్‌, ఇన్నోవేషన్‌లో టీఎస్‌ దబ్ల్యూఆర్‌ఎస్‌ నారాయణపేట, జడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ ధన్వాడ, జూనియర్స్‌లో ఎంపీ యూపీఎస్‌ తీలేర్‌, జడ్పీహెచ్‌ఎస్‌ దామరగిద్ద, ఎన్విరాన్‌మెంటల్‌ కాన్సెప్ట్‌లో టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ గర్ల్స్‌ ఊట్కూర్‌, జ్యోతిబా పూలే మక్తల్‌ బాయ్స్‌, జూనియర్స్‌లో యూపీఎస్‌ మల్లెపల్లి, కృష్ణ గోకులం పేట, హిస్టారికల్‌ డెవలప్‌మెంట్‌ విత్‌ కరెంట్‌ ఇన్నోవేషన్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ బాలికలు మక్తల్‌, సరస్వతి శిశు మందిర్‌ పేట, బయోటిక్స్‌ ఫర్‌ అజ్‌లో మాడ్రన్‌ హై స్కూల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ చిన్నపొర్ల, జూనియర్స్‌లో జడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ ధన్వాడ, యూపీఎస్‌ లాల్‌ మజ్జీద్‌ పేట కైవసం చేసుకున్నాయి.

Updated Date - 2022-12-06T23:13:46+05:30 IST