ఇళ్ల స్థలాల హద్దులను చూపించేదాకా పోరాటం

ABN , First Publish Date - 2022-10-02T05:23:24+05:30 IST

అమరచింత మునిసిపాలిటీలోని దుంపాయికుంటలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల హద్దులను చూపించేదాకా పోరాటాన్ని ఆపేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇళ్ల స్థలాల హద్దులను చూపించేదాకా పోరాటం
తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాలో మాట్లాడుతున్న ఎండీ జబ్బార్‌

- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ 


అమరచింత, అక్టోబరు 1: అమరచింత మునిసిపాలిటీలోని దుంపాయికుంటలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల హద్దులను చూపించేదాకా పోరాటాన్ని ఆపేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలతో పట్టణంలో భారీ ఊరేగింపు చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ  కొనసాగిం ది. తహసీల్దార్‌ కార్యాలయం ముందు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా జబ్బార్‌ మాట్లాడుతూ పట్టణంలోని దుంపాయికుంటలో 25ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిందని, నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులకు హద్దుల ఏర్పాట్లను చేయకపోవడం విచార కరమని ఆందోళన చెందారు. 26రోజులుగా ఆ కుంటలోనే లబ్ధిదారులు హద్దులను ఏర్పాటు చేసుకొని, చీరలతో గుడిసెలను వేసుకొని నివాసముంటున్నా అధికారుల్లో స్పందన లేదని ఆరోపించారు. అధికారులు ఎన్ని అడ్డంకులు కల్పించినా లబ్ధిదా రులు ఆ ప్రాంతంలోనే ఈనెల 10 తరువాత పక్కాగా గుడిసెలు వేసుకుని నివా సం ఉంటారన్నారు. లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి వంటావార్పు ఏర్పాటుచేస్తామని హెచ్చరించారు. అనం తరం తహసీల్దార్‌ సింధూజకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సీపీ ఎం మండల కార్యదర్శి జీఎస్‌.గోపి, జిల్లా నాయకులు బి.వెంకటేష్‌, ఆర్‌ఎన్‌.రమేష్‌, అజయ్‌, బుచ్చన్న, అనంతమ్మ, ఆకాశవేణి తదితరులు పాల్గొన్నారు. 

Read more