రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

ABN , First Publish Date - 2022-10-12T04:49:08+05:30 IST

రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

-  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- రోడ్డు భద్రతపై  సమీక్ష

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని   కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్లు బాగులేక, అవసరమైన చోట సూచిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు లేక జిల్లాలో చాలా మంది ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ఎస్పీతో పాటు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌, రోడ్లుభవ నాలు, పంచాయతీరాజ్‌, ఇంజనీర్లు, ట్రాన్స్‌పోర్టు అధికారి, జిల్లా వైద్యాధికారి, మునిసిపల్‌ కమిషన ర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ ప్రతీ నెల సమా వేశమై జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా జరిగిన రోడ్డు ప్రమాదాలు అందుకు కారణాలు, చట్టపరమైన చర్యలపై సమీక్షిస్తుందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 130రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 141మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక మీదట రోడ్డు ప్ర మాదాలు జరగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారు లపై సమీక్షిస్తూ ఇప్పటి వరకు ఎన్ని రోడ్డు మర మ్మతులకు పరిపాలన అనుమతులు వచ్చాయి, టెండర్‌ ఎన్నింటికి జరిగాయి, అగ్రిమెంట్‌ ఎన్నింటి కి పూర్తి అయింది, పనులు ఏ స్థాయిలో ఉన్నా యని బ్లాక్‌వారిగా సమీక్షించారు. పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతుకు 21పనులకు పరిపాలన అను మతి మంజూరుకాగా రూ. 19.12కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, నాలు గింటికి టెండర్లు పూర్తి కాగా మిగిలిన వాటికి టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని పంచాయతీరాజ్‌ ఈఈ దామోదర్‌రావు సమాధానం ఇచ్చారు. త్వరగా టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్‌ చేసుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై 108ఎప్పుడు ఉండేలా చూడటం, అందులో పని చేసే డ్రైవర్లకు ప్రమాదం జరిగిన చోటు నుంచి అతి సమీపాన ఉన్న ఆసుపత్రులు ఏవి, వాటి వివరాలు తెలిసి ఉండాలని తదనుగుణంగా నివే దిక సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. వైద్యశాఖతో సమన్వయం చేసుకొని ప్రణాళికను సిద్ధం  చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో మనుషులు, జం తువులు, రోడ్డు దాటే ప్రాంతంలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. జాతీయ రహదారి మధ్యలో, సైడ్‌లలో మొక్కల పెంపకం బాగలేదని, వెం టనే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిబంధనల ప్రకారం జిల్లాకు రావా ల్సిన అడ్మినిస్ట్రేరటివ్‌ కాస్ట్‌ మంజూరు చేయించాల్సిందిగా సూచించారు. రోడ్డు భద్ర త ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా ట్రాన్స్‌పోర్టు అధికారిని ఆదేశించారు. రోడ్డుప్ర మాదాల్లో గాయపడిన వారిని రక్షించిన వారి వివరాలు సేకరించాలని అలాంటి వారికి జాతీయ దినోత్సవాల సందర్భంగా సన్మానం చేసేవిధంగా చర్యలు తీసుకో వాలని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, ఆర్‌ అండ్‌బీ ఈఈ భాస్కర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ దామోదర్‌రావు, జాతీయ రహ దారుల డీజీఎం అశోక్‌రెడ్డి, ఆర్‌టీవో ఎర్రిస్వామి, ఆర్టీసీ డిపో మేనేజర్‌, డీఈలు, మెడికల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T04:49:08+05:30 IST