మట్టి గణపతులను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-08-11T05:14:07+05:30 IST

కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

మట్టి గణపతులను ప్రోత్సహించాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ శివశక్తినగర్‌లో శ్రీకాంత్‌చారి ఏర్పాటు చేసిన మట్టి గణపతుల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేష్‌, కౌన్సిలర్లు తిరుపతమ్మ, రామ్‌లక్ష్మణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌, కిషోర్‌, ముడా డైరెక్టర్‌ వెంకటేష్‌ గౌడ్‌, నవకాంత్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన వరద భాస్కర్‌, కృష్ణపవార్‌

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 10 : టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధ వారం హైదరాబాద్‌లోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్యాంప్‌ కార్యాలయంలో మహబూబ్‌నగర్‌ పట్టణ సోషల్‌ మీడియా విభాగం నాయకులు వరదభాస్కర్‌, కృష్ణపవార్‌, టీకే నరేశ్‌ తది తరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి శ్రీనివాగౌడ్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజు, రామకృష్ణ, పరమేశ్‌, ఎదిర ప్రమోద్‌ పాల్గొన్నారు. 

14న జానపద కళాకారులతో ప్రదర్శన

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహించను న్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ మైదానం నుంచి బాదం రామస్వామి ఆడిటోరియం వరకు జానపద కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తారని, వివిధ కళా ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.

16న జిల్లా పరిషత్‌లో కవి సమ్మేళనం

ఈ నెల 16న సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వజ్రోత్సవస్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు ఈ నెల 14లోపు 8247301883 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా పంపించాలని సూచించారు. కవిసమ్మేళనానికి రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్వర్ణా సుధాకర్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారని ఆయన తెలిపారు.

Read more