బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇన్ని పథకాలు చూపండి

ABN , First Publish Date - 2022-09-29T05:10:04+05:30 IST

తెలంగాణలో పార్టీ లకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్కటైనా చూ పగలరా అని ఆ పార్టీ నాయకులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇన్ని పథకాలు చూపండి
సుంకురాంపల్లిలో బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

అడ్డాకుల, సెప్టెంబరు 28 : తెలంగాణలో పార్టీ లకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్కటైనా చూ పగలరా అని ఆ పార్టీ నాయకులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మండ లంలోని శాఖాపూర్‌, కందూరు, సుంకురాంపల్లి, పొన్నకల్‌ తదితర గ్రామాల్లో ఆసరా పింఛన్‌ మం జూరు పత్రాలు, బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. శాఖాపూర్‌లో ప్రమాద వశాత్తు చనిపోయిన ఎండీ అలీ భార్య జహంగీ ర్‌బీకి పార్టీ సభ్యత్వం నుంచి వచ్చిన రూ.2 లక్షల బీమా చెక్కును లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందజే శారు. పొన్నకల్‌ గ్రామంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిం చారు. చేరిన వారిలో అఖిల్‌, శ్రీకాంత్‌, మహేశ్‌, శివ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యు డు రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ కిషన్‌, మండల కో-ఆప్ష న్‌ ఖాజాఘోరి, జడ్పీ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు మహిమూద్‌, సర్పంచులు జయన్నగౌడ్‌, శ్రీకాంత్‌, మల్లిక, కల్పన, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

భూత్పూర్‌ : మునిసిపాలిటీ పరిధిలోని ఊర చెరువును మినిట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేస్తున్నా రు. బుధవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొత్తకోటకు వెళ్లుతూ మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సినీయర్‌ నాయకుడు అశోక్‌గౌడ్‌, బ్రహ్మయ్య చారితో ఎమ్మెల్యే కాసేపు మాట్లాడారు. మునిసిపాలిటీగా  ఏర్పాటైన మూడేళ్లకే స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపిక కావడం చాలా పంతోషాన్ని కల్గిస్తుందన్నారు. 

Updated Date - 2022-09-29T05:10:04+05:30 IST