కోస్గిలో ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రులు సీజ్‌

ABN , First Publish Date - 2022-09-20T05:11:52+05:30 IST

కోస్గి మునిసిపాలిటీ పరిధిలో అర్హత, అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రులను సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వో రామ్‌ మనోహర్‌ రావు సీజ్‌ చేశారు.

కోస్గిలో ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రులు సీజ్‌

కోస్గి, సెప్టెంబరు, 19:  కోస్గి మునిసిపాలిటీ పరిధిలో అర్హత, అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఏడు ప్రైవేట్‌ ఆస్పత్రులను సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వో  రామ్‌ మనోహర్‌ రావు సీజ్‌ చేశారు.  అర్హత లేని డాక్టర్లు, అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఆసుపత్రులను కొనసాగిస్తూ అమాయక ప్రజల దగ్గర లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే  ఫిర్యాదు వైద్యశాఖ అధికారులకు అందాయి. వైద్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు రావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసి ఉంచారు. దీంతో మూసి ఉన్న ఆస్పత్రులను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అనుమతులు లేకుండా మెడికల్‌ దుకాణాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులను కొనసాగించవద్దని హెచ్చరించారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం చట్టరీత్య నేరం అవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలలో చికిత్సలు, సిజేరియన్‌లు, అబార్షన్‌లు చేస్తే సహించేది లేదన్నారు. కోస్గి పట్టణంలోని చిన్నారి ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యుడు అర్హత లేని సర్టిఫికెట్‌లతో వైద్య చికిత్సలు చేస్తుండటంతో ఆసుపత్రిని సీజ్‌ చేశారు. 


Updated Date - 2022-09-20T05:11:52+05:30 IST