సహకార సంఘం ద్వారా రైతులకు సేవలు

ABN , First Publish Date - 2022-09-30T04:40:19+05:30 IST

సహకార సంఘం ద్వారా రైతులకు బహుళ సేవలందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోటకదిర సింగిల్‌విండో చైర్మన్‌ ఏ. రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

సహకార సంఘం ద్వారా రైతులకు సేవలు
పీఏసీఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సింగిల్‌ విండో చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి

- సింగిల్‌ విండో చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 29 : సహకార సంఘం ద్వారా రైతులకు బహుళ సేవలందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోటకదిర సింగిల్‌విండో చైర్మన్‌ ఏ. రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అప్పాయిపల్లి వద్ద ఉన్న కోటకదిర సింగిల్‌విండో కార్యాలయ భవనంలో నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పంటరుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తున్నామని, సకాలంలో తిరిగి చెల్లించి సొసైటీల బలోపేతానికి సహకరించాలని రైతులను కోరారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రైతుల ప్రయోజనాలే మొదటి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ కార్యవర్గ సభ్యుడు నరసింహులు, మన్యంకొండ ఆలయ పాలకవర్గ సభ్యుడు చిన్నయ్య, జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు అల్లావుద్దీన్‌, ముడా డైరెక్టర్‌ ఆంజేనేయులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, సర్పంచులు ఊశన్న, పీఏసీఎస్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read more