రెండవ రోజు 69 ప్లాట్లకు వేలం

ABN , First Publish Date - 2022-03-16T05:44:02+05:30 IST

రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌, అంబర్‌ టౌన్‌ షిప్‌ ప్లాట్ల వేలం ప్రక్రియ రెండవరోజు ప్రశాంతంగా కొనసాగింది.

రెండవ రోజు 69 ప్లాట్లకు వేలం
రాజీవ్‌ స్వగృహ ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్న అధికారులు

- పాల్గొన్న 330 మంది

- గజానికి గరిష్ఠంగా రూ.13,700, కనిష్ఠంగా 5,600 

గద్వాల క్రైం, మార్చి 15 : రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌, అంబర్‌ టౌన్‌ షిప్‌ ప్లాట్ల వేలం ప్రక్రియ రెండవరోజు ప్రశాంతంగా కొనసాగింది. పట్టణంలోని బృందావన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో మొదటి రోజు సోమవారం నిర్వహించిన వేలం పాటకు 350 మంది రాగా, 58 ప్లాట్లకు వేలం నిర్వహించారు. మంగళవారం రెండవ రోజు 69 ప్లాట్లకు వేలం నిర్వహించారు. వేలం పాటలో 330 మంది పాల్గొనగా, గజానికి గరిష్ఠంగా రూ.13,700, కనిష్ఠంగా రూ.5,600 లకు పాడి ప్లాట్లను దక్కించుకున్నారు. ప్లాట్లు పొందిన వారు మూడు విడతలలో నగదు చెల్లించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. మిగిలిపోయిన ప్లాట్లకు ఇంకా రెండు రోజులు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, మునిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌, అధికారులు రాజు, మదన్‌మోహన్‌, సిబ్బంది  పాల్గొన్నారు.

Read more