కిడ్స్‌హోంలో పాఠశాల సంత

ABN , First Publish Date - 2022-11-27T22:39:22+05:30 IST

నారాయణపేట కిడ్స్‌హోం పాఠశాల విద్యార్థులు ఆదివారం సహ పాఠ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల సంత నిర్వహించారు.

కిడ్స్‌హోంలో పాఠశాల సంత
పాఠశాల సంత నిర్వహిస్తున్న కిడ్స్‌హోం విద్యార్థులు

నారాయణపేట, నవంబరు 27 : నారాయణపేట కిడ్స్‌హోం పాఠశాల విద్యార్థులు ఆదివారం సహ పాఠ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల సంత నిర్వహించారు. సేంద్రియ ఎరువులతో తయారు చేసిన కూరగాయలు, పళ్లు, పువ్వులు, కిరాణ, వెదురుతో ఇంటికి అవసరమయ్యే వస్తువులు, అల్పహారం స్టాల్స్‌ను నిర్వహించి ఆకట్టుకున్నారు. పాఠశాల నిర్వహకులు వరలక్ష్మి, రజినీ మాట్లాడుతూ ఆర్థిక అంశాల నిర్వహణ వంటి నైపుణ్యాలు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్వకుళ సాళి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్మరాం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:39:25+05:30 IST