ఉపాధ్యాయురాలికి సావిత్రీబాయి పూలే పురస్కారం

ABN , First Publish Date - 2022-01-04T05:25:00+05:30 IST

మల్దకల్‌ మండలం అమరవాయి జడ్పీహెచ్‌ఎస్‌ గణిత ఉపాధ్యాయురాలు కె.అనిత సావిత్రీబాయి ఫూలే రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు.

ఉపాధ్యాయురాలికి సావిత్రీబాయి పూలే పురస్కారం
ఉపాధ్యాయురాలు అనితకు పురస్కారాన్ని అందిస్తున్న ముఖ్యఅతిథులు

గద్వాల క్రైం, జనవరి 3 : మల్దకల్‌ మండలం అమరవాయి జడ్పీహెచ్‌ఎస్‌ గణిత ఉపాధ్యాయురాలు కె.అనిత సావిత్రీబాయి ఫూలే రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. సావిత్రీ బాయి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం (మహిళా విభాగం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అనిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. 


Read more