కల్లాల వద్దే వరి కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-11-11T23:15:59+05:30 IST

పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్నా కల్లాల వద్దకు వెళ్లి వరి కొనుగోలు చేయాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

కల్లాల వద్దే వరి కొనుగోలు చేయాలి
ఊట్కూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- రెండు ఎకరాల భూమి ఇస్తే

ఊట్కూర్‌లో గోదాము నిర్మిస్తాం

- వరి అమ్మిన రెండు రోజుల్లోనే

రైతు ఖాతాలోకి డబ్బులు

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఊట్కూర్‌, నవంబరు 11 : పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్నా కల్లాల వద్దకు వెళ్లి వరి కొనుగోలు చేయాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎసీఎస్‌ వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషాతో కలిసి ప్రారంభిం చారు. అలాగే పీఎసీఎస్‌ భవనానికి ప్రహరి నిర్మాణానిక భూమి పూజ చేశారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరు అయిన ఎల్‌వోసీలను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం క్వింటల్‌ వరికి 2060 కొనుగోలు చేస్తున్నదని అన్నారు. బయట రేటు అధికంగా ఉన్నా డబ్బులు రావడానికి ఆలస్యం అవుతుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు రెండు రోజుల్లో డబ్బులు ఖాతాలో జమ అవుతాయన్నారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. మండల కేంద్రంలో రెండు ఎకరాల భూమి కేటాయిస్తే రైతుల సౌకర్యార్థం గోదాములు కూడా నిర్మించడానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌ నిజామ్‌పాషా, ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఊట్కూర్‌ సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఇబాదుర్‌రహెమాన్‌, ఎంపీటీసీ సభ్యుడు హన్మంతు, పీఏసీఎస్‌ కార్యదర్శి హుస్సేన్‌, నాయకులు అరవింద్‌కుమార్‌, వై. నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, శివరామరాజు, రైతులు అధికారులు పాల్గొన్నారు.

ప్రతీ గింజను కొంటాం..

మాగనూరు: రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయం వద్ద డీసీసీబీ చైర్మన్‌ నిజాం పాషాతో కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రా రం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలమ్మ, సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఏవో హరి త, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సర్పంచు రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎల్లారెడ్డి, శివరామిరెడ్డి, శ్రీని వాసులు, పల్లె మారెప్ప, విజయ్‌గౌడ్‌, సిబ్బంది ఆంజనేయులు, వెంకటేష్‌ , ఏఈవోలు పాల్గొన్నారు.

సంగంబండ గ్రామంలో..

మక్తల్‌ రూరల్‌ : మక్తల్‌ మండలం సంగంబండ గ్రామంలో మక్తల్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి , డీసీసీబీ చైర్మన్‌ నిజామ్‌పాషా వరి కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:15:59+05:30 IST

Read more