వదలని వాన

ABN , First Publish Date - 2022-10-02T05:05:29+05:30 IST

నాలుగు రోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వ ర్షాలు శనివారం కూడా జిల్లాలో కొనసాగింది.

వదలని వాన
గల్లంతైన రాఘవేందర్‌ ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్‌ఆర్‌డీఏ బృందాలు

- శనివారం కూడా జిల్లా అంతటా జల్లులు

- దుందుభీలో గల్లంతైన యువకుడి కోసం రెస్క్యూ టీం ఆపరేషన్‌


 నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):  నాలుగు రోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వ ర్షాలు శనివారం కూడా జిల్లాలో కొనసాగింది. వ ర్షపాతం నమోదు కావ డంతో దుందుభీ నది ఉ గ్రరూపం దాల్చింది. లో లెవల్‌ బ్రిడ్జిలపై నుంచి భారీ ఎత్తున ప్రవాహం వస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుందుభీ నది పరి వాహక ప్రాంతాలైన కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో రోడ్డు దాటకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయం త్రం వరకు వంగూరులో అత్యధికంగా 90మి.మీటర్లు, చారకొండలో 65.6, కోడేరులో 40.6, బిజినేపల్లిలో 40.2 మి.మీటర్ల వర్షం పడింది. జిల్లాలో మొత్తం 605.7 మిల్లీ మీటర్ల వర్షం పడింది. మరో వైపు తెలకపల్లి మండలం కార్వంగ, తాళ్లపల్లి గ్రామాల మధ్య దుందుభీ వాగులో గల్లంతైన రాఘవేందర్‌ ఆచూకీ కోసం రెస్క్యూ టీం ఆప రేషన్‌ కొనసాగుతున్నది. డిండి ప్రాజెక్టులో భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో వాహనాలను కల్వకుర్తి మీదుగా దారి మళ్లిస్తున్నారు. వర్షాలతో అడ్డా కూలీలు, భవ న నిర్మాణకార్మికులకు ఉపాధి కరువైంది. చిరు వ్యాపారులూ ఇబ్బందులు తప్పలేదు.


దొరకని గల్లంతైన యువకుడి ఆచూకీ

తెలకపల్లి:  మండల పరిధిలోని తాళ్లపల్లి వాగులో గల్లంతైన రాఘవేందర్‌ అనే యువకుడి ఆచూకీ కోసం శనివారం రాష్ట్ర ఎన్‌ఆర్‌డీఏ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి శుక్రవారం ఉదయం తాళ్లపల్లికి చెందిన రాఘవేందర్‌ అనే యు వకుడు వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాళ్లపల్లి వాగు వద్ద గల్లంత య్యాడు. గాలింపు చేపట్టినప్పటికీ శనివారం సాయంత్రం వరకు ఆచూకీ దొరకలేదు. ఎంపీపీ మధు, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌, డీటీ లక్ష్మణ్‌లు పరిస్థితిని సమీక్షించారు. 



Updated Date - 2022-10-02T05:05:29+05:30 IST