Rahul's Bhatat jodo Yatra: తెలంగాణలో 23 నుంచి నవంబర్ 6వరకు ..

ABN , First Publish Date - 2022-10-12T21:22:00+05:30 IST

Mahaboob nagar: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ రాహుల్ గాంధీ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రకు దేశప్రజలంతా మద్దతు తెలిపి యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Rahul's Bhatat jodo Yatra: తెలంగాణలో 23 నుంచి నవంబర్ 6వరకు ..

Mahaboob nagar: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ రాహుల్ గాంధీ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రకు దేశప్రజలంతా మద్దతు తెలిపి యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఈనెల 23వ తేదీ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 6వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రోజు సాయంత్రం ప్రజలతో మమేకమై  రాహుల్ గాంధీ మాట్లాడతారు. కేంద్రప్రభుత్వ కార్పోరేటీకరణ, నిరుద్యోగ సమస్యఎజెండాగా రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ప్రజా ప్రయోజనాలే తప్పా పార్టీ ప్రయోజనం కోసం పాదయాత్ర చేయటం లేదు. 14 రోజులపాటు తెలంగాణలో జరిగే రాహుల్ పాదయాత్రను ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి.’’ అని మాణిక్యం ఠాకూర్ కోరారు. 

Updated Date - 2022-10-12T21:22:00+05:30 IST